మంత్రి సీతక్కను కలిసిన టీఎన్జీవో నాయకులు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధికారిక పర్యటన లో భాగంగా జిల్లా కేంద్రానికి విచ్చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ,గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రి సీతక్కను ఐడీఓసీ కార్యాలయంలో టీఎన్జీవో నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలైన పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ అమలుతో కూడిన ఇతరత్రా అంశాలపై, అంగన్వాడి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై చర్చించి, వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు....