నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అధికారిక పర్యటన లో భాగంగా జిల్లా కేంద్రానికి విచ్చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ,గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్ శాఖ, ఉమ్మడి జిల్లాల ఇన్చార్జి మంత్రి సీతక్కను ఐడీఓసీ కార్యాలయంలో టీఎన్జీవో నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలైన పెండింగ్ బిల్లులు, పీఆర్సీ, ఈహెచ్ఎస్ అమలుతో కూడిన ఇతరత్రా అంశాలపై, అంగన్వాడి ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై చర్చించి, వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టీఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా జాయింట్ సెక్రటరీ జాఫర్ హుస్సేన్, టిఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, జిల్లా కార్యవర్గ సభ్యులు మంగమ్మ, విజయలక్ష్మి, సునీల్, అంగన్వాడి ఉద్యోగుల జిల్లా అధ్యక్షురాలు అనురాధ తదితరులు పాల్గొన్నారు.
