నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అఖిలభారత ఉద్యోగ సమైక్య ఉపాధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షులు మారం జగదీశ్వర్, టీఎన్జీవో కేంద్ర సంఘ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం.హుస్సేని ను హైదరాబాద్ లోని నాంపల్లిలో గల టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో నాంపల్లి జిల్లా టీఎన్జీఓ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిసి సోమవారం శాలువతో సన్మానించారు. అనంతరం వివిధ శాఖల ఉద్యోగుల సమస్యలపై చర్చించి వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, టిఎన్జీవో జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, కోశాధికారి టి.దినేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు గుడికందుల సంజీవయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శులు జాఫర్ హుస్సేన్, అతిక్ అహ్మద్, టిఎన్జీవో అర్బన్ యూనిట్ కార్యదర్శి జాకీర్ హుస్సేన్ , అర్బన్ యూనిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.