టీఎన్జీఓ జిల్లా కార్యవర్గ సమావేశం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : టీఎన్జీఓ జిల్లా కార్యవర్గ సమావేశం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్ అధ్యక్షతన గురువారం టిఎన్జీవో జిల్లా కార్యాలయం లోనిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుమన్ కుమార్ ఇటీవల సీఎం ఉద్యోగుల సమస్యలపై  మాట్లాడిన తీరును వివరించారు. దీనికి గాను రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల వివరణల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్ లతో కూడిన త్రిసభ్య  కమిటీని తక్షణమే...