Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 6:07 pm Posted by : ramakrishna

పీసీసీ అధ్యక్షుడిని కలిసిన టీఎన్జీవో జిల్లా కమిటీ సభ్యులు

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

నూతనంగా ఎన్నికైన టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాద పూర్వకంగా కలిసారు. మంగళవారం హైదరాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో టీఎన్జీవో నిజామాబాద్ జిల్లా పక్షాన కలిసి సన్మానించారు. అనంతరం సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ పెద్దలతో సమన్వయపరచుకొని సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేసిన పిసిసి అధ్యక్షుడిని ఘనంగా సన్మానించి, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్, జిల్లా కార్యదర్శులు నేతికుంట శేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.