Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 May 2025, 3:32 pm Posted by : ramakrishna

భీమ్ ఆర్మీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా టిఎన్.రమేష్ రావణ్

కామారెడ్డి, బతుకమ్మ : భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ కామారెడ్డి, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులుగా టి ఎన్ రమేష్ ని నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ రమేష్ రావణ్ కి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ రావణ్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతల్ని తన యొక్క కర్తవ్యాన్ని బహుజన నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో దిగ్విజయం చేస్తానని తెలిపారు. తనకు భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు ఉత్తర్ ప్రదేశ్ నగిన పార్లమెంట్ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, రాష్ట్ర అధ్యక్షులు వనం మహేందర్ కి కృతజ్ఞతలు తెలిపారు.