Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 May 2025, 8:19 pm Posted by : ramakrishna

టీజేఎఫ్ రజతోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (TJF) రజతోత్సవ సంబురాల పోస్టర్లను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆవరణలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా బాధ్యులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకపాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు.  దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం మలి దశ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరచడంలో తెలంగాణ జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని వారు గుర్తుచేశారు. ఈ నెల 31న జలవిహార్ లో నిర్వహిస్తున్న రజతోత్సవాలకు నిజామాబాద్ జిల్లా నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో  టియుడబ్ల్యూజే 143 జిల్లా బాధ్యులు జి.సాయి ప్రసాద్, పంచరెడ్డి శ్రీకాంత్, బాల కుమార్, దివాకర్,  ఆంజనేయులు, భానుతేజ, అజ్మత్, సాయి కులకర్ణి, అరుణ్ గౌడ్, సురేష్,  సితార కృష్ణ, రాజేష్, మోహన్, శ్రీనివాస్, కృష్ణ, పులగం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.