తిరుపతి, బతుకమ్మ : తిరుపతిలోని గంగమ్మ జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు అమ్మవారికి తొలి పూజ చేశారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దంపతులు గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈజాతరలో భాగంగా ఈ రోజు అర్ధరాత్రి గంగమ్మ విశ్వరూప దర్శనం ఇవ్వనుంది. గంగమ్మ అమ్మవారిని సీపీఐ నారాయణ దర్శించుకున్నారు.
