తిరంగా ర్యాలీ కరపత్రం ఆవిష్కరణ

బతుకమ్మ బోధన్ : "మనం సైతం దేశం కోసం" అనే నినాదంతో, "సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ – బోధన్" ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ని నిర్వహించనున్నారు. "ఆపరేషన్ సిందూర్ విజయవంతం" సందర్భంగా భారత సైనికుల పరాక్రమాన్ని గర్వంగా గుర్తిస్తూ, ఈ ర్యాలీని జూన్ 1న ఆదివారం సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ర్యాలీ పెద్ద హనుమాన్ మందిరం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించబడుతుంది. భారతీయుడిగా మన బాధ్యతను, ఐకమత్యాన్ని చాటిచెప్పే ఈ కార్యక్రమంలో కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకతీతంగా అన్ని...