Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 May 2025, 5:25 pm Posted by : ramakrishna

తిరంగా ర్యాలీ కరపత్రం ఆవిష్కరణ

బతుకమ్మ బోధన్ : “మనం సైతం దేశం కోసం” అనే నినాదంతో, “సిటిజెన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ – బోధన్” ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ని నిర్వహించనున్నారు. “ఆపరేషన్ సిందూర్ విజయవంతం” సందర్భంగా భారత సైనికుల పరాక్రమాన్ని గర్వంగా గుర్తిస్తూ, ఈ ర్యాలీని జూన్ 1న ఆదివారం సాయంత్రం 4:00 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ ర్యాలీ పెద్ద హనుమాన్ మందిరం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించబడుతుంది. భారతీయుడిగా మన బాధ్యతను, ఐకమత్యాన్ని చాటిచెప్పే ఈ కార్యక్రమంలో కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్ పట్టణ ప్రధాన కార్యదర్శి రాజులదేవి పవన్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మా రెడ్డి ఉపాధ్యక్షులు యోగిరాజ్ వైద్య, జోర్రిగల రవీందర్ బీజేవైఎం అధ్యక్షులు అనుగంటి గౌతమ్ గౌడ్, కందికట్ల వాసు, BVS కస్ప లింగం, బీజేపీ నాయకులు బాబు రావు, సాయి తదితరులు ఈ ర్యాలీ ద్వారా భారత సైనికుల మనోధైర్యానికి మద్దతు తెలిపి, దేశభక్తిని వ్యక్తపరచాలని నిర్వాహకులు కోరుతున్నారు.