Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 November 2024, 8:48 pm Posted by : ramakrishna

వరి నారు మడి రక్షణ కు సూచనలు

బతుకమ్మ, మోర్తాడ్: యాసంగి పంట కాలంలో వరి నారు ఎదగకుండా, ఆకులు పసుపు రంగు తీర్పులోకి మారడం కొన్నిసార్లు నారు చనిపోవడం జరుగుతుంది చలి ప్రభావం వల్ల ఇలా జరుగవచ్చని వ్యవసాయ అధికారి హరీష్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని ధర్మోరా గ్రామంలో గురువారం వరి నారును పరిశీలించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన సాయంకాలం వేళ నారు మడిలో నీరు తీసివేసి పగటిపూట వేచ్చటి నీరు పెడుతూ ఉండాలని తెలిపారు. వరి నారు లో కాండం తొలుచు పురుగు తెగులు కనిపించిన, అగ్గి తెగులు వంటి లక్షణాలు కనిపించిన వారి దృష్టికి తీసుకు రావడం వలన ఏటువంటి చర్యలు తీసుకోవాలో సూచనలు చేస్తామని పేర్కొన్నారు.