ఆకు ఎండు తెగులు నివారణకు సూచనలు
బతుకమ్మ పిట్లం : పిట్లం మండలంలోని మద్దెలచెరువు, బండపల్లి గ్రామములో మల్ తుమ్మద డాటా సెంటర్ శాస్త్రవెత్తలు, పిట్లం మండల వ్యవసాయ అధికారులు వరి పంటలను శుక్రవారం క్షేత్ర స్థాయిలో సందర్శించారు. ప్రస్తుతం వరి పంటలో ఆకు ఎండు తెగులు ఉధృతి గమనించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. తెగులు నివారణకు యూరియా వాడకం తగ్గించాలి.ఆకు ఎండు తెగులు నివారణకు గానూ ప్లాంటో మైసిన్ 80 గ్రాములు /ఎకరాకు పిచికారి చేయవలెను మరియు కంకి నల్లి నివారణకు స్పైరొమేసిఫిన్ 200 ఎంఎల్/ఎకరాకు...