Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 March 2025, 7:54 pm Posted by : ramakrishna

టిప్పర్, ట్రాక్టర్లు సీజ్

బతుకమ్మ, మాచారెడ్డి: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక లారీ, మూడు ట్రాక్టర్ల ను సీజ్ చేసినట్లు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. పాల్వంచ, వాడి  బండరామేశ్వర్ పల్లి వాగుల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ  సందర్భంగా మాచారెడ్డి,  పాల్వంచ మండల ప్రజలు  ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యను తీసుకుంటామన్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే 100 కి కాల్ చేసి తెలుపాలని ఆయన కోరారు.