సకాలంలో బిల్లుల చెల్లింపులు
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సిరన్ పల్లిలో లబ్ధిదారులతో భేటీ ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల సందర్శన నిజామాబాద్, బతుకమ్మ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నవీపేట మండలం సిరన్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. లబ్దిదారులను కలిసి, ఇంటి నిర్మాణాలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. గ్రామంలో 93 మందికి ఇళ్లు మంజూరు కాగా, 69 గ్రౌండింగ్ అయ్యాయని,...