Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 January 2025, 12:10 pm Posted by : ramakrishna

కాలాన్ని భూమి యొక్క కదలికలకు అనుగుణంగా గణిస్తున్నాం

. . . ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్  ప్రచారక్ వెంకటశివకుమార్

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

భారతీయ సంస్కృతి శాస్త్రీయమైనదని, భారతీయ క్యాలెండర్ మాత్రమే శాస్త్రానికి అనుగుణంగా ఉందని, వేల సంవత్సరాలుగా మనం కాలాన్ని భూమి యొక్క కదలికలకు అనుగుణంగా గమనాన్ని గణిస్తున్నామని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్  ప్రచారక్ వెంకటశివకుమార్ అన్నారు. ఆర్ఎస్ఎస్ నాందేవ్ వాడ, కంఠేశ్వర్ ఉపనగరాల సంక్రాంతి ఉత్సవంలో ఇందురు విభాగ్ ప్రచారక్ వక్త నర్రా వెంకట శివ కుమార్ సంక్రాంతి సందేశం ఇచ్చారు. అలాగే జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటా వివేకానందుడు ప్రపంచానికి హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందించారన్నారు. విశ్వశాంతికి హిందూ ధర్మమే ఆధారమని, ప్రతి వ్యక్తి హిందువునని గర్వించు హిందువుగా జీవించు అని సగర్వంగా చాటి చెప్పే సమయం వచ్చింది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘచాలకు డాక్టర్ కాపర్తి గురు చరణం, నగర కార్యవాహ అర్గుల సత్యం, మధుకర్ షిండే, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Time is calculated according to the movements of the earth