అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రాల వద్ద గట్టి నిఘా

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా కొనసాగిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల చెక్ పోస్టుల స్థితిగతులపై రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత జిల్లాల కలెక్టర్లు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా కొనసాగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ఉమ్మడి తనిఖీ కేంద్రాల...