. . . ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
. . . గొడవలకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం
. . . శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు 1500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు
. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య వెల్లడి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ఈ నెల 11న నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాదు కార్పొరేషన్ , బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతియుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. నిజామాబాదు కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయని, 220 పోలింగ్ స్టేషన్ లలో 4,94,954 మంది ఓటర్లు గలరని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ శాఖ పరంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇందుకు గాను నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఎన్నికలు నిర్వహించే ప్రాంతాలలో 3 ప్లాటున్లు టి.ఎస్.ఎస్పి సిబ్బంది, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే అన్నీ ప్రాంతాల్లో నిర్విరామముగా నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి 24 / 7 వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సమస్యత్మక ప్రాంతాలలో పటిష్ట మైన నిఘా వ్యవస్థ ఏర్పాట్లు చేయడం జరిగిందని, 10 ఎఫ్.ఎస్.టీ టీమ్స్, 12 ఎస్. ఎస్. టీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, లిక్కర్ మొత్తం 4 కేసుల లో 42.44 లీటర్లు సీజీ చేయడం జరిగిందని, వాటి విలువ దాదాపు 22,926 గలదని తెలిపారు. నిజామాబాదు, ఆర్మూర్, బోధన్, భీంగల్ పరిధిలో బైండోవర్ లు మొత్తము 162 మందిని సంబంధిత తహసీల్దారుల ముందు హాజరు పరిచి బైండోవర్ చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళిని ఉల్లంఘించినటువంటి వారిపై 5 కేసులు నమోదు చేయడం జరిగిందని, టౌన్ 1, టౌన్ 3, బోధన్, భీంగల్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయడం జరిగిందని, మొత్తం 73 మంది వద్ద గన్ లైసెన్లు కలిగినటువంటి వారిని డిపాజిట్ చేయమని తెలియజేయగా 93 డిపాజిట్ చేయడం జరిగిందని. మిగతా 28 గన్ లైసెన్సులు బ్యాంకుకు సంబంధించినది గలవని పేర్కొన్నారు. ఎన్నికలు గల ప్రాంతం లో 5 మంది లేదా అంత కంటే ఎక్కువ మంది ప్రజలు గుమి గుడరాదని, ఎవరైనా ఆలా గుమి కుడితే వారిపై 163 బి.ఎన్.ఎస్.ఎస్,. చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుందని, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత బయటి ప్రాంతాలవారు ఉండకూడదని వారన్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు ఎక్కడ ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి ఎన్నికల నేపథ్యంలో 1500 మందిని సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.