కామారెడ్డి గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పటిష్ట భద్రత
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనం సాగేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. భక్తి మనసులో బాధ్యత మన చేతుల్లో సమిష్టి సహకారంతో సురక్షితమైన గణేష్ నిమజ్జనం జరుపుకుందామని పిలుపునిచ్చారు. గణేష్ నిమజ్జనానికి 420 మంది అధికారులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. 162 సీసీ కెమెరాలు, 3 డ్రోన్లతో నిరంతర నిఘా, మద్యం సేవించి వాహనాలు నడపడం, ప్రమాదకర విన్యాసాలు నిషేధం, నిమజ్జన...