Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 September 2025, 7:47 pm Posted by : ramakrishna

దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలకు పకడ్బందీ భద్రత

. . .కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, బతుకమ్మ :

 

ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలకు పోలీసు శాఖ పకడ్బందీగా భద్రత ఏర్పాట్లు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో శరణవరాత్రి ఉత్సవాలతో పాటు దసరా పండుగ జరుపుకోవాలని అందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉత్సవాల కోసం ఆన్ లైన్ విధానంలో వివరాల నమోదు తప్పనిసరి తెలిపారు. పది రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మండపాల వద్ద భద్రత నియామకాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. మండపాల ఏర్పాటుకు ఊరేగింపుల కోసం కచ్చితంగా పోలీసు వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండపాల నిర్వాహకులదే పూర్తి బాధ్యత అని తెలిపారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. శోభాయాత్ర, నిమజ్జనం నిర్ధేశిత సమయంలోనే జరుగాలని తెలిపారు. మండపాలకు వివిధ శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని, కమిటీ బాధ్యుల ఫోన్ నంబర్లు తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. మండపాల వద్ద అసాంఘిక కార్యక్రమాలకు అనుమతించలేదని లేదని తెలిపారు. అగ్నిప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని , 24 గంటలు వాలంటీర్లు అందుబాటులో ఉండాలని తెలిపారు.