. . . కందకుర్తి వద్ద గల గోదావరి పుష్కరాల ఘాట్లను సందర్శించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి పార్కింగ్ సమస్యలు, ఇతర అవరోధాలు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కందకుర్తి పుష్కర ఘాట్లను బుధవారం ఆయన పర్యవేక్షించారు.

ఇందులో భాగంగా 2027 సంవత్సర కాలంలో రాబోయే గోదావరి పుష్కరాలను ఉద్దేశించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులు, పుష్కర ఘాటుకు వచ్చే రోడ్డు, వెళ్లే దారుల్లో, పార్కింగ్ ప్రదేశాలలో ఎటువంటి సమస్యలు ఉండకూడదన్నారు. అలాగే ఎవరు కూడా నీళ్లలో మునిగి ప్రాణ నష్టం జరగకుండా పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామస్తులతో మాట్లాడి గత పుష్కరాల్లో ఏమేం లోటుపాట్లు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బోధన్ ఎ.సి.పి శ్రీనివాస్, బోధన్ రూరల్ సర్కిల్ సిఐ విజయ్ బాబు, రెంజల్ ఎస్.ఐ కే. చంద్రమోహన్, కందకుర్తి సర్పంచ్, ఉపసర్పంచ్ నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
