సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
. . . జోన్-7 డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ పరిశీలన మహబూబ్‌నగర్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ గ్రామంలో నిర్వహించనున్న పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జోన్-7 జోగులాంబ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా ఎస్పీ డి. జానకి తో కలిసి డీఐజీ సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలు, ప్రజల రాకపోకల మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు, భద్రతా బందోబస్తు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. కార్యక్రమం...