Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 5:07 pm Posted by : ramakrishna

సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

 

. . . జోన్-7 డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ పరిశీలన

 

మహబూబ్‌నగర్, బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శనివారం మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ గ్రామంలో నిర్వహించనున్న పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను జోన్-7 జోగులాంబ డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా ఎస్పీ డి. జానకి తో కలిసి డీఐజీ సభా ప్రాంగణం, హెలిప్యాడ్, పార్కింగ్ స్థలాలు, ప్రజల రాకపోకల మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు, భద్రతా బందోబస్తు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. కార్యక్రమం సజావుగా జరిగేలా తీసుకుంటున్న చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, వీఐపీ రాకపోకలు, సభా నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Tight security arrangements for the CM's visit.