Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 8:12 pm Posted by : ramakrishna

పులి గోర్లు, దంతాలు స్వాధీనం..

 

. . . దుబ్బాక లో పులి కళేబారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి అటవి రేంజ్ పరిధిలోని దుబ్బాక గ్రామంలో పులి కళేబరాన్ని ఇందల్వాయి అటవి రేంజ్ అధికారి రవి మోహన్ బటర్ ఆధ్వర్యంలో ఆటవిశాఖ అధికారులు వ్యవసాయ క్షేత్రం వద్ద ఉన్నటువంటి బావిలో మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదే గ్రామానికి చెందిన అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుగుతున్నట్లు సమాచారం. దీంతో పాటు నిధుల వద్ద పులి గోర్లు, దంతాలు స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాలో పులులు సంచరిస్తున్న ప్రాంతాలను వేటగాళ్లు వలపన్నీ మాటు వేస్తూ పులి చర్మం తో పాటు గోర్లు, దంతాలకు డిమాండ్ నేపథ్యంలో వాటిని హతమార్చి వేటగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారని తెలిసింది. ఈ మేరకు పోలీసులు అటవిశాఖ అధికారులు కేసులు నమోదు చేసుకొని వేటగాళ్లపై ఉక్కు పాదం మోపుతున్నారని తెలుస్తుంది.