- బీసీ రిజర్వేషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
హైదరాబాద్, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ నెల 9న మధ్యాహ్నం 2.15 గంటలకు తిరిగి వాదనలు ప్రారంభం కానున్నాయి. గురువారం మరిన్ని వాదనలు వినిపిస్తామని ఏజీ తెలిపారు.. రేపటి నోటిఫికేషన్ ఇవ్వకుండా చూడాలన్న పిటిషనర్ వాదనలను హైకోర్టు పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వం గురువారం యధావిధిగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుంది.