Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 6:55 pm Posted by : ramakrishna

బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా తూము శరత్ రెడ్డి

 

బోధన్, బతుకమ్మ :

 

కాంగ్రెస్ పార్టీ బోధన్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా 25వ వార్డు కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి ని నియమించారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రోద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాన్ని గురువారం శరత్ రెడ్డి అందుకున్నారు. అనంతరం బోధన్ మున్సిపల్ కమిషనర్ ని కలిసి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్, బోధన్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ల ఆధ్వర్యంలో నియమిక పత్రాన్ని వారికి అందజేశారు. అనంతరం శరత్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా నియమించినందుకు ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కి, కాటేపల్లి నగేష్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.