Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 4:46 pm Posted by : ramakrishna

బోధన్ మున్సిపాలిటీ చైర్మన్‌గా తూము పద్మావతి

 

. . . వైస్ చైర్మన్‌గా మీర్ ఇలియాజ్ అలీ

 

బోధన్, బతుకమ్మ :

 

బోధన్ మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా ముగిసింది. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూము పద్మావతి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా ఆల్ ఇండియా మజ్లిస్ – ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) కౌన్సిలర్ మీర్ ఇలియాజ్ అలీ విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్, ఎంఐఎం, స్వతంత్రులు, ఎక్స్‌ అఫిషియో సభ్యుల మద్దతుతో మొత్తం 31 ఓట్లు తూము పద్మావతికి లభించాయి. గతంలో చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆమెకు అనుకూలంగా మారిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసారి జనరల్ కోటాలో ఉన్న చైర్మన్ పదవిని బీసీ వర్గానికి కేటాయించినట్లు కాంగ్రెస్ నాయకత్వం వెల్లడించింది. సామాజిక సమతుల్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వైస్ చైర్మన్‌గా ఎన్నికైన మీర్ ఇలియాజ్ అలీకి ఎంఐఎం, కాంగ్రెస్, స్వతంత్ర సభ్యుల మద్దతు లభించింది. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అన్ని వర్గాల సహకారంతో ముందుకు సాగుతామని నూతన చైర్మన్ తూము పద్మావతి స్పష్టం చేశారు. బోధన్ పట్టణ రాజకీయాల్లో ఈ ఎన్నిక కీలక మలుపుగా భావిస్తున్నారు.

 

 

Thumu Padmavati elected as Bodhan Municipality Chairman