Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 3:00 pm Posted by : ramakrishna

అర్ధరాత్రి మహిళను రౌండప్ చేసిన ఆకతాయిలు

 

. . . ఐపీఎస్ అధికారిణి అని తెలిసి షాక్

. . . 40 మంది పోకిరి లకు పోలీసుల కౌన్సిలింగ్

హైదరాబాద్, బతుకమ్మ:

మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌గా నాలుగు రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్న ఐపీఎస్ అధికారిణి సుమతి డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగారు. అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల వరకూ దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, సాధారణ మహిళలా బస్టాండ్‌లో తిరిగారు. ఆ సమయంలో చాలా మంది యువకులు.. ఆమెను చుట్టుముట్టారు.. వెకిలి ప్రశ్నలతో వేధించారు. మూడున్నర గంటల తర్వాత ఒక బీట్ కానిస్టేబుల్ అక్కడికి రావడంతో.. అసలు విషయం బయటపడింది.

Thugs round up woman in the middle of the night

 

అర్ధరాత్రి 12 గంటల నుంచి 3.30 వరకు సాగిన స్పెషల్ ఆపరేషన్ సమయంలో 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.పట్టుబడ్డ వారిలో విద్యార్థులు, ఉద్యోగులు ఉండగా ఇందులో పలువురు గంజాయి, మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. దాదాపు 40 మంది యువకులను స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఐపీఎస్ అధికారిణి రాత్రి వేళ పోకిరి లు ఇంత వేధించారు అంటే అత్యవసర పరిస్థితుల్లో అర్ధరాత్రి బయటకు వెళ్ళే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి..

Thugs round up woman in the middle of the night