స్కూల్ వాటర్ ట్యాంకులో విషం కలిపిన దుండగులు..

ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో ఘోరం మధ్యాహ్నభోజన సామాగ్రిపైనా చల్లిన వైనం సిబ్బంది అప్రమత్తతో తప్పిన ముప్పు..  పోలీసులకు హెచ్ఎం ఫిర్యాదు   ఆదిలాబాద్, బతుకమ్మ : అదిలాబాద్ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. పిల్లలు, టీచర్లు తాగే నీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపైనా విషం చల్లారు. అయితే, మధ్యాహ్న భోజన సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జిల్లాలోని ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది....