గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి మూడేళ్ల ప్రణాళికలు రూపొందించాలి
. . . జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి గ్రామస్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా మూడేళ్ల సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. 2026–27 నుంచి 2028–29 ఆర్థిక సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, విద్యుత్, విద్య, ఆరోగ్యం, ఉపాధి, నీటి సంరక్షణ వంటి ప్రాథమిక అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని...