Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2024, 2:49 pm Posted by : ramakrishna

మూడు టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

నిజామాబాద్  క్రైం, బతుకమ్మ: నగరంలోని ఐదో టౌన్ పరిధిలో మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. అజాంకాలనీలోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద మినీ ట్రక్కులో పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. అఫ్సర్ అనే వ్యక్తికి సంబంధించిన 70 బస్తాల బియ్యాన్ని తరలిస్తున్న అమీర్ మహ్మద్ అలియాస్ చావూస్ ను పట్టుకున్నారు. బియ్యంతోపాటు వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అఫ్సర్ అనే వ్యక్తిపై సస్పెక్ట్ షీట్ ఉండగా పీడీఎస్ మాఫియాలో మొన్నటి వరకు కీలకంగా వ్యవహరించారు.

Three tons of ration rice is seized