Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2025, 2:11 pm Posted by : ramakrishna

మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

మాచారెడ్డి, బతుకమ్మ: అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. గురువారం బండ రామేశ్వర్ పల్లి వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రోజూ ఏదో ఒక చోట ఇసుక ట్రాక్టర్ ను పట్టుకుంటున్నా కామారెడ్డి – సిరిసిల్ల రహదారి వెంబడి ఉన్న వాగు నుంచి ప్రతి రోజూ ఇసుక అక్రమ రవాణా సాగుతూనే ఉంది.

ఇసుక డంపులు సీజ్
బాన్సువాడ, బతుకమ్మ : నిజాంసాగర్ మండలం అచ్చంపేట పంచాయతీ పరిధిలోని మరుపల్లిలో ఇసుక డంపులను ను అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా ఇసుక డంప్ చేశారనే సమాచారం మేరకు బుధవారం ఆర్ఐ సాయిబాబ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. అనుమతి లేకుండా 18 ట్రాక్టర్ల ఇసుకను తీసుకొచ్చి డంప్ చేశారని గుర్తించారు. కాగా అదే ప్రాంతంలో మరిన్ని ఇసుక నిల్వలు ఉన్నాయని, వాటిని సీజ్ చేయలేదని స్థానికులు అంటున్నారు.

Three sand tractors seized