నీట మునిగి ముగ్గురు మృతి.. తిరువళ్లూరులో విషాదం
తిరువళ్లూరు, బతుకమ్మ : తిరువళ్లూరులో విషాదం చోటు చేసుకుంది. నీట మునిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. తిరువళ్లూరులోని శ్రీ వైద్య వీరరాఘవ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి హరిహరన్ (16), వెంకట్రమణన్ (17), వీరరాఘవన్ (24) అనే ముగ్గురు యువకులు వచ్చారు. రోజువారీ మతపరమైన ఆచారాలు నిర్వహించడానికి ఆలయ కోనేరు వద్దకు యువకులు వెళ్లారు. ముందుగా ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మునిగిపోతుండగా.. కాపాడాలని వెళ్లిన మరో ఇద్దరు కూడా మునిగి మృతి చెందారు. ముగ్గురు యువకులు...