వెబ్ న్యూస్, బతుకమ్మ : రాష్ట్రం లో ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు అధికారులు రెండు రోజుల వ్యవధిలో సస్పెన్షన్ కు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ కోరుట్ల ఎస్ఐ, ధర్మపురి మున్సిపల్ కమిషనర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధుల నిర్వాహణలో నిర్లక్ష్యం కారణంగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతిని జగిత్యాల కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈఘటనలు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈఘటనలు రెండు రోజుల్లోనే చోటుచేసుకోవడం గమనార్హం.