Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 8:24 pm Posted by : ramakrishna

రెండు కాలువలకు మరో మూడు రోజులు

బతుకమ్మ,మెండోరా: రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాకతీయ ప్రధాన కాలువ(above LMD) జోన్-2, సరస్వతి కాలువ ఆయకట్టుకు  మరో మూడు రోజులు సాగునీటి విడుదల కొనసాగుతుందని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇరిగేషన్ సర్కిల్ సూపర్డెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ గుప్తా తెలిపారు. మిగతా అన్ని కాలువలు, లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థలకు బుధవారం నుంచి సాగునీరు నిలిపివే బడునని ఆయన పేర్కొన్నారు.  ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలి.  సాగునీటి వినియోగం తర్వాత ప్రాజెక్ట్ లో మిగిలే నీటిని నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల్, నిర్మల్ , అదిలాబాద్ జిల్లాల తాగునీరు కోసం వినియోగించుకునే  విధంగా సహకరించాలని  రైతులందరినీ కోరుతున్నామని తెలియజేశారు. కాకతీయ కాలువ లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందువల్ల , కాలువ దరిదాపుల్లోకి సామాన్య ప్రజలు ఎవరూ రావద్దని , ప్రమాదానికి గురికావద్దని తెలియజేశారు.