Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 February 2025, 12:51 pm Posted by : ramakrishna

అగ్ని ప్రమాదంలో మూడు ఇళ్లు దగ్ధం

బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మూడు పెంకుటిల్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శాంతవ్వ, సాయవ్వ, గంగామణి తమ ఇళ్లకు తాళం వేసి శివాలయానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి మూడు ఇళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ధాన్యం, దుస్తులు, విలువైన వస్తువులు కాలిబూడిదయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.