Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 January 2025, 10:58 am Posted by : ramakrishna

ముగ్గురు విద్యార్థినిల మిస్సింగ్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:  నవీపేట్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నముగ్గురు విద్యార్థినిలు కనిపించకుండాపోయారు. ఈ నెల 2న పాఠశాలకు వెళ్తున్నామని వెళ్లిన కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మీ, గడ్డం రవళిక అనే విద్యార్థినిలు సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విద్యార్థినిల మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్సై తెలిపారు. వివరాలు తెలిసిన వారు నవీపేట్ ఎస్సై 8712659845, నార్త్ సిఐ 8715659843లకు సంప్రదించాలని కోరారు.

Three female students are missing

Three female students are missing