Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 6:59 pm Posted by : ramakrishna

రాష్ట్రంలో ముగ్గురు డిఎస్పీల బదిలీ

  • నిజామాబాద్ సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారి బదిలీ

 

నిజామాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ముగ్గురు డిఎస్పి లను  బదిలీ చేస్తూ రాష్ట్ర డిజీపి శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ గా పని చేస్తున్న ఎం.వి.శ్రీనివాస్ రావును ఖాళీగా ఉన్న దేవరకొండ డిఎస్పీగా బదిలీ చేశారు. నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీగా పని చేస్తున్న కె. నాగేంద్రచారిని సిరిసిల్లా డి ఎస్పీగా బదిలీ చేశారు. గత ప్రభుత్వ హయాంలోనూ నాగేంద్రచారి వేములవాడ డిఎస్పీ గా పని చేయడం గమనార్హం. సిరిసిల్లా డిఎస్పీగా పని చేస్తున్న కటకం చంద్రశేఖర్ ను డిజిపీ కార్యాలయం లో రిపోర్ట్ చేస్తూ ఇతరులులో రిపోర్ట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.