నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తెలంగాణ విశ్వవిద్యాలయంలో జంతు శాస్త్ర విభాగం విద్యార్థులకు సెరికల్చర్, కేంద్రీయ పట్టు పరిశ్రమ బోర్డు ఆధ్వర్యంలో మూడు రోజులు హ్యాండ్స ఆన్ ట్రైనింగ్ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ప్రసన్న శీలను, విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదానం చేసి వైస్ ఛాన్స్లర్ మాట్లాడుతూ విద్యార్థులు క్షేత్రస్థాయిలో పరిశోధనలు జరిపి ఉపాధి హామీ కోర్సులపై విద్యార్థులు కేంద్రీకరించాలని కోరారు. ఈ ట్రైనింగ్ లో విద్యార్థులకు మల్బరీ కల్చర్, పట్టు రోలింగ్ విధానం మరియు చాకి గుడ్ల ఉత్పత్తి కేంద్రం నిర్వహణ , గుడ్ల ఉత్పత్తి విధానం, నూతన కల్చర్ పద్ధతులు, పోలింగ్ విధానంలో ఆధునిక యంత్రాల నిర్వహణ గురించి క్షేత్రస్థాయి అనుభవాలను, మార్కెటింగ్ పద్ధతులను తెలిపారు. ఈ శిక్షణలో నేషనల్ సిల్క్ బోర్డ్ సైంటిస్ట్ డాక్టర్ వినోద్ యాదవ్, టెక్నికల్ ఆఫీసర్, రాఘవేంద్ర హార్టికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సెరికల్చర్ ఆఫీసర్ ఐలయ్యలు రిసోర్స్ పర్సన్స్ గా వ్యవహరించారని విభాగాధిపతి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆచార్యులు సునీల్ కుమార్, విజయ్ కుమార్, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.