ఆర్మూర్, బతుకమ్మ: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో సంఘం భాగ్యలక్ష్మి ఆమె తన ముగ్గురు పిల్లలను రూ. 4.2 లక్షలకు అమ్మిన సంఘటన ఆర్మూర్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆర్మూర్ ఏఎస్ఐ జి చిన్నయ్య, పెట్రోలింగ్ చేస్తుండగా సంఘం భాగ్యలక్ష్మి ఆమె తన ముగ్గురు పిల్లలను ఇతరులకు అమ్మి వేశారని, తన ముగ్గురు పిల్లలలో ఒకరిని బత్తుల గంగాధర్ కి 1లక్ష, రూపాయలకు, ఒకరిని సలావాసు వనజ కి రెండు లక్షల రూపాయలకు, ఇంకొకరిని దేశబోయి నరసయ్య కు 1.2 లక్షల రూపాయలకు అమ్మినట్లు ఆయన తెలిపారు. పిల్లలను అమ్మిన సంఘం భాగ్యలక్ష్మి పై సుమోటో కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు ఆర్మూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పి సత్యనారాయణ గౌడ్ తెలియజేశారు.