చైల్డ్ సేఫ్టీపై మూడు అవగాహన కార్యక్రమాలు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశానుసారం నిజామాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చైల్డ్ సేఫ్టీ అంశంపై మూడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు మాక్లూర్ మండలంలోని మెట్టు, మాధాపూర్, వేణు కిసాన్ నగర్ గ్రామాలలో మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, పితృస్వామ్యం, జెండర్ బైయాస్, సైబర్ నేరాల...