నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మద్యం మత్తులో పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు 5వ టౌన్ ఎస్సై సునీల్ తెలిపారు. మంగళవారం రాత్రి 5వ టౌన్ పరిధిలోని సాయినగర్ రోడ్డు నం.3కి చెందిన శ్రావణ్, రాకేష్, రఘురాం అనే మ్గుగరు మద్యం మత్తులో న్యూసెన్స్ చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించేందుకు ప్రయత్నించగా వారినే దుర్భాషలాడారు. అంతేగాకుండా విధులకు ఆటంకం కలిగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి రాకేష్, శ్రావణ్, రఘురాంలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.