Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 12:40 pm Posted by : ramakrishna

ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదరింపులు

హైదరాబాద్‌, బతుకమ్మ :  ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదరింపులు వచ్చాయి. ఈఘటనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విజయశాంతి భర్త శ్రీనివాస ప్రసాద్ ఫిర్యాదు చేశారు. విజయశాంతి బీజేపీలో ఉన్న సమయంలో ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ ను చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి చూసేవాడు.  కాంగ్రెస్ లో చేరిన తర్వాత చంద్రకిరణ్ రెడ్డిని ఎమ్మెల్సీ విజయశాంతి పక్కన పెట్టింది.  దీంతో చంద్రకిరణ్ రెడ్డి తనకు డబ్బులు చెల్లించాలని విజయశాంతికి బెదిరింపు సందేశం పంపాడు. బకాయిలు తీర్చకుంటే మీరు శత్రువులు అవుతారని మెసెజ్ చేశాడు. ఆమోదయోగ్యం కాని రీతిలో సందేశాలు ఉన్నాయని, చంద్రకిరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమేరకు వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.