బోధన్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:
జిల్లా రెడ్ క్రాస్ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విద్యుత్ శాఖ ఏడి ఈ తోట రాజశేఖర్ కు రెడ్ క్రాస్ లో రాష్ట్రపతి అవార్డు దక్కడం అభినందనీయమని బోధన్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇటివల రాష్ట్రపతి అవార్డు పోందిన తోట రాజశేఖర్ ను బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి సన్మానించి సత్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ..సమాజ సేవలో ముందుంటూ అందరికీ సేవలు అందిస్తూ ప్రగతి సాధిస్తున్న జిల్లా రెడ్ క్రాస్ రాష్ట్రంలో ప్రగతి పథంలో నడవడం జిల్లా కే గర్వకారణం అని అన్నారు.ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సమాజంకై సేవలు అందించాలని అప్పుడే అభివృద్ధికి బాట పడుతుందని చెప్పారు. రాజశేఖర్ ఇటు వృత్తిలోనూ అటు సేవారంగంలో ముందుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో కార్యక్రమంలో కార్యక్రమంలో కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార సమాఖ్య లిమిటెడ్ చైర్మన్ ,జిల్లా డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, కోశాధికారి కరిపే రవీందర్, జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ రవీందర్ తదితరులు ఉన్నారు.