- మద్నూర్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే
బతుకమ్మ,మద్నూర్: పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు ఉంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనివారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. మద్నూర్ మండల నాయకులు, కార్య కర్తలు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యే తో చర్చించడం జరిగింది. సమస్యల పరి ష్కారం దిశగా ఎమ్మెల్యే కృషి చేస్తానని అదేవిధంగా మండలంలో అంగన్వాడీ భవనాలు, సబ్ స్టేషన్, విద్యుత్ స్తంభాలు, నీటి సౌకర్యంరోడ్లు, కాంపౌండ్ వాల్స్, పాఠశాల భవనాలు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చు తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నియోజకవర్గంలో మనం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవ్వాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. పార్టీ వ్యతిరేక శక్తులు కొందరు ఏకమై పార్టీ ప్రతిష్టను దిగజార్చి పార్టీని చీల్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆ దుష్ట శక్తుల కుట్రలు తిప్పి కొట్టేవిధంగా మన తదుపరి కార్యాచరణ ఉండాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దర్సావార్ సాయిలు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ సీనియర్ నాయకులు హన్మంత్ రావు దెశాయ్, విట్టల్ గురూజీ, హనుమాన్ స్వామి, సోమావార్ మహేష్, బస్వంత్ రావు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.