Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 January 2025, 8:21 pm Posted by : ramakrishna

డబ్బులు ఉన్నోళ్లకు పార్టీలు మారే వారికి పధవులు అమ్ముకోంటున్నారు

. . .  రాస్ట్ర మహిళ కాంగ్రెస్ చీప్ సునితారావుపై మహిళ నేతల సంచలన ఆరోపణలు

 నిజామాబాద్, బతుకమ్మ:

కాంగ్రెస్ పార్టిని నమ్ముకోని సభ్యత్వాల నమోదు తో పాటు పార్టి ఇచ్చిన ప్రతి పిలుపు స్పంధించిన నేతలను కాదని పార్టిలు మారేవారికి, డబ్బులున్నోళ్లకు పార్టి పధవులు, ప్రభుత్వంలో పధవులు  అమ్మకుంటున్నారని జిల్లా మహిళ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం మహిళ కాంగ్రేస్ నేతలు తంబాకు చంద్రకళ, రేవతి, సుజాత, మలైకా బేగం, పద్మ లు విలేఖరులతో  మాట్లాడుతు… పేదల పార్టీ గరిబోళ్ల పార్టీ ఐనా కాంగ్రెస్ పార్టిలో రాష్ట్ర మహిళ కాంగ్రేస్ అధ్యక్షురాలు సునిత రావు పార్టి పధవులను, ప్రభుత్వ పధవులకు పార్టిని నమ్ముకున్న వారికి కాకుండా పార్టీలు మారేవారికి అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తాము కాంగ్రెస్ పార్టిని నమ్ముకోని దశాబ్ధ కాలంపై కష్టపడి పనిచేశామని కాని తమను కాదని ఇతర పార్టీలలో నుంచి వచ్చిన వారికి, గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని విడీ ఇతర పార్టీలలోకి వేళ్లిన వారు అధికారంలోకి రాగానే తిరిగి వచ్చిన వారికి పధవులు ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ లను గుర్తించి పధవులు, పార్టీ పధవులను ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ పెద్ధలను అవసరమైతే ఎఐసిసీకి పిర్యాదు చేస్తామని తెలిపారు. మహిళ కాంగ్రెస్ నేతలు ఎకంగా రాష్ట్ర అధ్యక్షురాలిపై చేసిన సంచలన అరోపణలు కలకలం రేపుతున్నాయి.