బోధన్, బతుకమ్మ: బోధన్ పట్టణంలో బహిరంగ ప్రదేశాలను అడ్డాలుగా చేసుకుని మద్యం సేవించిన వారికి సెకండ్ క్లాస్ మేజిస్ర్టేట్ శేష తల్పసాయి కమ్యూనిటి సర్వీస్ పనిష్మేంట్ విధించారు. బోధన్ పట్టణ సిఐ వేంకట నారాయణ తెలిపిన వివరాల ప్రకారం బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన 8 మందిని న్యాయస్థానం ఎదుట హజరు పరిచినట్లు తెలిపారు. వారికి ఒక రోజు పనిష్మేంట్ క్రింద బోధన్ కోర్డు అవరణలో పరిసరాలను పరిశుభ్రం చేయించాలని మెజిస్ర్టేట్ తీర్పు చెప్పారని దానిని అమలు చేయించినట్లు తెలిపారు.