Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 2:19 pm Posted by : ramakrishna

పార్టీని కాంప్రమైజ్ చేసేవారికి కార్యకర్తల శాపం తగులుతుంది

హైదరాబాద్, బతుకమ్మ:  తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ బై పోల్ హాట్ హాట్ గా మారింది. ఈనేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తాజా గా ఓ యూ ట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయా అన్న  ప్రశ్నకు స్పందిస్తూ జూబ్లీహిల్స్ సెగ్మెంట్ కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుందని ఈవిషయం కిషన్ రెడ్డి నే అడగాలన్నారు. పార్టనీ కాంప్రమైజ్ చేస్తున్నారంటే కన్నతల్లితోటి వ్యాపారం చేస్తున్నట్లే అని, దాని కంటే మించిన పాపం మరొకటి ఉండదని, కార్యకర్తల శాపం మీ తరతరాలకు తగలుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులోను బీఆర్ఎస్ తో బీజేపీతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు.

రేవంత్ రెండో సారి సీఎం కావొచ్చు

రాష్ట్రం లో బీఆర్ఎస్ మళ్లీ బలపడే ప్రసక్తే లేదని, బీజేపీ పుంజుకోకుంటే బీఆర్ఎస్ కు ఓటు శాతం పెరిగి కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ మారుతుందన్నారు. తెలంగాణ రాజకీయం కాంగ్రెస్, బీజేపీ ల మధ్యే ఉండబోతుందన్నారు. రేవంత్ రెడ్డి లక్కీ అని  మరోసారి సీఎం కూడా కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానివి డ్రామాలని విమర్శించారు. కేసీఆర్ ఫ్యామిలీకి ఓటమి  రుచి చూపించిందే తాను అని పేర్కొన్నారు.