Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 November 2024, 1:37 pm Posted by : ramakrishna

ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలి

బోధన్, బతుకమ్మ: రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలని, హిందూ దేవాలయాలను పరిరక్షించాలని బీజేవైఎం అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్, కార్యకర్తల ఆధ్వర్యంలో బుధవారం సబ్ కలెక్టర్ వికాస్ మహతోకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌతమ్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయాలని కోరారు. బీజేవైఎం బోధన్ పట్టణ అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్, బీజేపీ బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శి వాసు, అరవింద్, బీవీఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు కస్ప లింగం,కార్యకర్తలు, కిరణ్, శ్రీను, రాజు, చిన్న, సురేష్, సంతోష్, దీపక్, తదితరులు పాల్గొన్నారు.