Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 March 2026, 8:30 pm Posted by : ramakrishna

హిందువులపై దాడి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిరంతరంగా హిందువులపై దాడులు చేస్తూ, హిందువులను నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని ఎన్కౌంటర్ చేయాలని హిందూ ఐక్య వేదిక పటేల్ ప్రసాద్ అన్నారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని నాందేవ్ వాడ శివాజీ చౌక్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఢిల్లీలో హత్య చేయబడ్డ తరుణ్ కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ హోలీ పండుగ రోజు అనుకోకుండా కొద్దిగా కలర్ పడ్డందుకు తరుణ్ అనే వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపడం చాలా బాధాకరమని అన్నారు. మోస్రా గ్రామానికి చెందిన కానిస్టేబుల్ సౌమ్య అనే అమ్మాయిని కూడా జిహాదీ గంజాయి స్మగ్లర్లు నిర్దాక్షిణ్యంగా యాక్సిడెంట్ చేసి చంపేశారని, అలాగే ప్రమోద్ అనే కానిస్టేబుల్ ని కూడా కత్తితో పొడిచి చంపేశారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని, ఎంతో మందిని హిందువులపై గోరాతి ఘోరంగా దాడులు చేస్తూ చంపేస్తున్న ఈ జిహాదీగాళ్లపై ప్రభుత్వాలు కఠిన చర్య తీసుకోవాలని, హిందూ యువకులందరూ కూడా జాగృతం అయి ధర్మ రక్షణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ జగన్ మోహన్ గౌడ్, జలిగం గోపాల్, బంటురామరాజు, బోత్ కిషన్, పిట్ల స్వామి, రాహుల్, అరవింద్, మురారి, బినయ్, సంజీవ్, పురోహిత్, ప్రశాంత్, బంటి, రోహిత్, యువకులు పాల్గొన్నారు.

 

Those who attack Hindus should be severely punished.