Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 February 2025, 4:56 pm Posted by : ramakrishna

నాలుగు గంటల లోపు పోలింగ్ కేంద్రాలలో ఉన్న వారికి ఓటింగ్ కు అనుమతి

. . . 4 గంటల వరకు గ్రాడ్యుయేట్స్ 53.05 శాతం

. . .  టీచర్స్ 69.25 శాతం ఓటింగ్

 కరీం నగర్, బతుకమ్మ:

కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ న గురువారం  సాయంత్రం 4 గంటల లోగా పోలింగ్ కేంద్రం లోపలికి చేరుకున్న వారందరినీ ఓటింగ్ కు అనుమతించడం జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. 4 గంటల వరకు  గ్రాడ్యుయేట్స్ 53.05% శాతం ఓటు హక్కును వినియోగించుకోగా, టీచర్స్ 69.25% శాతం ఓటింగ్ పోలయ్యాయి. కరీంనగర్ లోని ముఖరంపురాలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన గ్రాడ్యుయేట్ ఎన్నికల పోలింగ్ స్టేషన్ లో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ, టిచర్ ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి క్యూ లైన్ లో  వెళ్లి గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తన గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Those who are in the polling stations within four hours are allowed to vote